శీతాకాలంలో పుష్కలంగా లభించే కమలా పండు రోజూ తీసుకోవడం వల్ల నిపుణులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను సూచిస్తున్నారు. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, హిమోగ్లోబిన్‌ను వృద్ధి చేస్తాయి. ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడటమే కాక, క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. శరీరానికి అవసరమైన విటమిన్లను అందించి, ద్రవ సమతుల్యతను కాపాడుతుంది.