సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెంట్ బాయ్‌ఫ్రెండ్ ట్రెండ్‌ను ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఏఐ ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి, ప్రత్యేక ఆఫర్ల పేరుతో యువతులను బురిడీ కొట్టిస్తున్నారు. బుకింగ్ క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. తల్లిదండ్రులు, యువతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.