బెండకాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన పోషక ఆహారం. అధిక ఫైబర్, తక్కువ కేలరీలు కలిగి ఉండటంతో మలబద్ధకం నివారణకు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మధుమేహ రోగులకు బెండకాయలోని ఇన్సులిన్ కంటెంట్, శ్లేష్మం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.