అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని వన్నూరు సాబ్ అనే ఎంపీటీసీ, కుక్క ముఖం ఉన్న మాస్క్ ధరించి సర్వసభ్య సమావేశంలో నిరసన తెలిపారు. కుక్కలు, కోతుల బెడద నుండి ప్రజలను రక్షించాలని అధికారులను కోరినా ఫలితం లేకపోవడంతో ఈ నిరసనకు దిగారు. ఈ వినూత్న నిరసన సమావేశంలో హైలైట్గా నిలిచింది.