రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో జరగాల్సిన బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. వధువు మైనర్ కావడంతో సమాచారం అందుకున్న ప్రభుత్వ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. వివాహాన్ని నిలిపివేసి, ఇరుపక్షాల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని పోలీసులు స్పష్టం చేశారు.