ఒడిస్సాలోని వాషింగ గ్రామంలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. మానసిక సమస్యలతో తరచుగా ఇంటి నుంచి వెళ్లిపోయే సనాతన నాయక్, జూలైలో అదృశ్యమయ్యాడు. కొన్ని రోజుల తర్వాత వరదల్లో కొట్టుకువచ్చిన గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు సనాతన్దిగా నిర్ధారించి కుటుంబానికి అప్పగించారు. కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తిచేసిన నెల రోజుల తర్వాత సనాతన్ సజీవంగా ఇంటికి తిరిగివచ్చాడు.