ఒడిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ రాష్ట్రంలో కేజీ టు పీజీ (కిండర్ గార్టెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు) ఉచిత విద్యను ప్రకటించారు. బీజేపీ తన సంకల్ప పత్రలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, బాలబాలికలందరికీ ప్రభుత్వ విద్యా సంస్థలలో ఈ సేవను అందిస్తోంది. బెంగాల్లో కేవలం బాలికలకు మాత్రమే ఈ హామీ ఉండగా, ఒడిస్సాలో అందరికీ వర్తిస్తుంది. ఇది విద్యార్థులందరికీ సమాన అవకాశాలను కల్పించే దిశగా కీలక నిర్ణయం.