బాపట్ల జిల్లా మార్టూరు నేతాజీనగర్ లోని సానం లక్ష్మి ఇంటి ఆవరణలో మునగ చెట్టు విరగకాపు కాస్తోంది. ఆకులకన్నా కాయలు ఎక్కువగా కనిపించడమే కాదు.. అవి కూడా ఐదు ఆరు అడుగుల పొడవు ఉండటం చూపరులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతటి పొడవైన మునగకాయలు ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని స్థానికులు అంటున్నారు.