ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ధనశైలి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారాముల కల్యాణం కోసం భక్తులు అనిత, వందన వినూత్నంగా తమ భక్తిని చాటుకున్నారు. ప్రతి అక్షింతపై శ్రీరామ అని రాసిన 1008 నామ తలంబ్రాలను సమర్పించారు. సూక్ష్మ అక్షరాలతో రామనామం రాసిన ఈ ప్రత్యేక అక్షింతలు వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి, భక్తులను పులకింపజేశాయి.