ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కొత్త చర్యలు తీసుకుంది. పదేళ్ళకు పైబడ్డ డీజిల్ వాహనాలు, పదిహేనేళ్ళు దాటిన పెట్రోల్ వాహనాలకు పెట్రోల్, డీజిల్ విక్రయించకూడదని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఢిల్లీలోని 350 పెట్రోల్ బంకులలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే సీసీ కెమెరాలు వాహనాల వయస్సును గుర్తించి, బంకర్లకు, పోలీసులకు, రవాణాశాఖకు సమాచారం అందిస్తాయి.