నిజామాబాద్ జిల్లాలోని రుద్రూర్ సమీపంలో బోధన్-బాన్సువాడ ప్రధాన రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు పది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు.