వినాయక చవితి నాటి నుంచి నిత్యపూజలు అందుకున్న గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. నిమజ్జనోత్సవం నేపథ్యంలో నిర్వహించిన గణేశ్ లడ్డూ కార్యక్రమంలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. దీంతో హైదరాబాద్లో ఓ గణేశ్ లడ్డూ రూ.2 కోట్లకు పైగా వేలంలో ధరపలికింది.