తమిళనాడులోని నీలగిరి జిల్లా కోతగిరి సమీపంలో నల్ల చిరుత కనిపించింది. సీసీటీవీ ఫుటేజ్‌లో దాని కదలికలు నమోదయ్యాయి. దీంతో అటవీ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. స్థానికులు భయంతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు.అటవీ జంతువులను గ్రామాల నుండి దూరంగా ఉంచేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.