చైనాలోని గువాంగ్డాంగ్ ప్రావిన్స్ లో ఏడు వేలకు పైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. చైనా ప్రభుత్వం దీన్ని చికెన్ గునియా అని పేర్కొంటున్నప్పటికీ, అమెరికా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. క్వారంటైన్ విధించడం, వైరస్ వ్యాప్తి తీరుపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ వైరస్ చికెన్ గునియా కంటే భిన్నమైనదేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.