Vande Bharat Express: దక్షిణ మధ్య రైల్వే విజయవాడ నుంచి బెంగళూరుకు తిరుపతి మీదుగా కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించనుంది. డిసెంబర్ 10న ఈ రైలు సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రైలు సేవలతో విజయవాడ నుండి తిరుమల శ్రీవారి దర్శనం ఒకే రోజులో పూర్తి చేసుకుని తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నూతన రైలు నంబర్ 20711.