కొత్త సిమ్ కార్డు తీసుకునే ముందు మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. ఆగస్టు 23 నుండి ఒక వ్యక్తి తొమ్మిది సిమ్ కార్డుల కంటే ఎక్కువ కలిగి ఉండకూడదు. ఈశాన్య రాష్ట్రాలు, అస్సాం, జమ్మూ కాశ్మీర్లలో ఈ పరిమితి ఆరు సిమ్ కార్డులు. డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ (DIP) ద్వారా టెలికాం సంస్థలు ఈ వివరాలను తనిఖీ చేస్తాయి.