ఇకపై వాట్సాప్ ఫార్వార్డ్ చేసిన లేదా స్క్రీన్ షాట్ తీసిన రైలు టికెట్లు చెల్లుబాటు కావు అని ఇండియన్ రైల్వేస్ స్పష్టం చేసింది. తనిఖీ సమయంలో స్క్రీన్ షాట్ టికెట్లు చూపిస్తే, కొత్త టికెట్ కొనుగోలు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా, జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐఆర్సీటీసీ యాప్ ద్వారా బుక్ చేసిన ఈ-టికెట్ లేదా ప్రింటెడ్ టికెట్లను మాత్రమే అనుమతిస్తారు.