హనుమకొండ కొత్త కలెక్టర్ స్నేహ శిబరిష్ మేడం తమ విధులను నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. చార్జి చేపట్టిన రెండో రోజే ప్రజావాణిలో హాజరై అధికారుల హాజరును పరిశీలించి, పనితీరులో లోపాలు గుర్తించి హెచ్చరించారు. అలాగే, పర్మిషన్ లేకుండా నడుస్తున్న ప్రైవేట్ స్కూల్ ను సీజ్ చేయించారు.