అనకాపల్లికి చెందిన ఓ వ్యక్తి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.16 లక్షలు దోచేశారు. లాటరీ తగిలిందని నమ్మించి, మొదట స్వల్ప మొత్తాలు జమ చేసి, ఆపై ఓటీపీ అడిగి ఈ మోసానికి పాల్పడ్డారు. ఇలాంటి నూతన మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.