Nellore News: నెల్లూరు జిల్లాలో డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేసిన ఓ వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. విడవలూరుకు చెందిన ప్రతాప్ అనే వ్యక్తి కొనుగోలు చేసిన డ్రై ఫ్రూట్స్ బాక్స్‌లో ఇంటికెళ్లి చూడగా పురుగులు దర్శనమిచ్చాయి. మూడు నెలల గడువు ఉన్నప్పటికీ పురుగులు రావడంతో ప్రతాప్ ఆవేదన చెందారు. నాణ్యతలేని ఉత్పత్తులు విక్రయిస్తున్న వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.