విశాఖపట్నం సముద్రతీరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 3 లక్షల మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా యోగాసనాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసింది.