నంద్యాల జిల్లాలో హైదరాబాద్ నుండి పాండిచ్చేరి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు గాయపడగా, వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.