ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ శివారు అనాసాగరం బైపాస్ వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.