వీసా స్కాం ఆరోపణలు, అరెస్ట్, విచారణ ఎదుర్కొంటున్న యూట్యూబర్ నందన బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీపై ఊహాగానాలు జోరందుకున్నాయి. నందనను బిగ్‌బాస్‌లోకి తీసుకుంటే మర్యాదగా ఉండదని కాంగ్రెస్ నాయకురాలు సంధ్యా రెడ్డి హెచ్చరించారు. సమాజానికి తప్పుడు సందేశం ఇవ్వొద్దని బిగ్‌బాస్ టీమ్‌ను, నాగార్జునను ఆమె ప్రశ్నించారు. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.