తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి కొనిదల పద్మజ ఖమ్మం జిల్లా మధుర మండలం మాటూరు పేటలో ప్రచారం నిర్వహించారు. జనసేన, బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తోట దీపికకు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు. పద్మజకు స్థానికులు ఘనస్వాగతం పలికారు.