ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో వేల సంఖ్యలో కాకులు ఒక్కసారిగా ఆకాశాన్ని కమ్మేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇది రాబోయే ముప్పుకు సంకేతమన్న చర్చ మొదలవగా, పక్షి శాస్త్రవేత్తలు దీనిని ముర్మురేషన్గా గుర్తించారు. ఆహారం, సురక్షిత స్థావరం కోసం వలస పక్షులు ఇలా గుంపులుగా ప్రయాణించడం సహజమని వివరించారు.