జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్ రేంజర్ల కాల్పులలో మృతి చెందిన తెలుగు జవాను మురళీ నాయక్‌కు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రులు, సైనిక అధికారులు పాల్గొన్నారు. మురళీ నాయక్ తల్లి ఆయన పార్థివ దేహానికి సెల్యూట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షలాది మంది ప్రజలు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు.