తాను కష్టాల్లో ఉన్నప్పటికీ తమిళనాడుకు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు దురై తన నిజాయితీని చాటారు. దారిలో దొరికిన 20 తులాల బంగారం, కిలో వెండిని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని దురై కుమారుడి వైద్య ఖర్చులకు సహాయం అందించారు.