న్యూయార్క్ లోని నాసావు MRI క్లినిక్‌లో షాకింగ్ ఘటన జరిగింది. లోహపు గొలుసు ధరించిన వ్యక్తి ఎమ్మారై స్కానింగ్ మిషన్‌లో తీవ్రంగా గాయపడి మరణించాడు. MRI స్కాన్ సమయంలో లోహ వస్తువులను ధరించకూడదు. స్టెంట్లు, ప్లేట్లు, రాడ్లు వంటి వైద్య పరికరాలు ఉన్నవారు డాక్టర్లకు ముందస్తుగా తెలియజేయాలి. MRI స్కాన్ సురక్షితంగా ఉండటానికి జాగ్రత్తలు అవసరం.