వర్షాకాలంలో చేపలు తినడం ఆరోగ్యానికి ప్రయోజనకరం అయినప్పటికీ, కలుషితమైన నీటిలో పెరిగిన చేపల వల్ల మైక్రోప్లాస్టిక్స్, పాదరసం శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. పెద్ద చేపల్లో పాదరసం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చిన్నారులు, గర్భిణీలకు ప్రమాదం ఉంది. అలాగే, వర్షాకాలంలో నీటిలో పెరిగే బ్యాక్టీరియా కూడా జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి, శుభ్రమైన నీటిలో పెరిగిన చేపలను మాత్రమే తినడం మంచిది.