తెలంగాణలోని జగిత్యాలకు చెందిన మహమ్మద్ యూసఫ్ అనే ముస్లిం యువకుడు 11 రోజుల పాటు హనుమాన్ దీక్ష చేపట్టారు. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత శ్రీరాముడి దయకు కృతజ్ఞతగా ఆయన ఈ దీక్ష చేశారు. నియమ నిష్టలతో దీక్షను పూర్తి చేసి, కొండగట్టులో మాల విరమణ చేశారు. మత సామరస్యానికి ఆయన ప్రతీకగా నిలిచారు.