పార్టీ కీలక నాయకురాలు, కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. పార్టీ సీనియర్ నేతలతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకోబడింది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ భవన్ నుండి అధికారిక ప్రకటన విడుదల అయింది. దీనితో కవిత రాజకీయ భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది.