కేటీఆర్‌ను ఓడించేందుకు హరీష్ రావు కుట్రలు చేశారని కవిత ఆరోపించారు. ఇందు కోసం రూ.60 లక్షలు సిరిసిల్లకు పంపారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ చుట్టూ మేకవన్నె పులులు ఉన్నాయన్నారు. వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కేసీఆర్ లాగా తాను కూడా సూటిగా మాట్లాడుతానని చెప్పారు.