ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అక్రమ రేషన్ బియ్యం రవాణాను అరికట్టేందుకు కీలక ప్రకటన చేశారు. రాజానగరం నియోజకవర్గంలో అక్రమ బియ్యం పట్టిచ్చిన వారికి రూ.5 వేల బహుమతిని అందజేస్తామని ఆయన తెలిపారు. జనసేన పార్టీ కార్యకర్తలు ఈ ప్రయత్నంలో భాగస్వామ్యులై, అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేస్తారని పేర్కొన్నారు.