దగ్గు మందు పేరుతో అమ్ముతున్న మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోడీన్ ఫాస్ఫేట్ అనే ఈ మందును అధికంగా సేవించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఈ మందును నిషేధించినప్పటికీ, కొందరు దొంగతనంగా అమ్ముతున్నారు. గంజా, డ్రగ్స్‌పై పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో మత్తు కోసం కొందరు యువకులు ఈ మందులను తీసుకుంటున్నారు.