పాలకొండలోని శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతమైంది. కార్తీక మాసం ద్వాదశి పర్వదినాన, ఆదివారం ఉదయం 6:20 గంటలకు సూర్యుని లేత కిరణాలు గర్భగుడిలోని అమ్మవారి మూల విరాట్‌ను సుమారు తొమ్మిది నిమిషాల పాటు తాకాయి. భక్తులకు ఇది ఒక దివ్య దృశ్యంగా నిలిచింది.