తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు హెచ్చరిక చేశారు. తెలంగాణ ప్రజలను అవమానించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదల కావని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ వాదిగా తనకు బాధ కలిగించాయని మంత్రి పేర్కొన్నారు.