పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని ఒక పాల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున దొంగలుపడ్డారు. స్థానిక ఆలమూరివారి వీధిలో శ్రీనివాస మిల్క్ డైరీలో ముగ్గురు వ్యక్తులు షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలకి ప్రవేశించారు. షాపులో ఉంచిన రూ. లక్ష నగదును అపహరించుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.