వనపర్తి జిల్లా ఆత్మకూరులో పరశురాం అనే రైతుకు చెందిన 53 పందులను దొంగలు అర్ధరాత్రి దొంగిలించే ప్రయత్నం చేశారు. సీసీ కెమెరాలో దొంగల కదలికలు గమనించి పరశురాం తన సోదరుడు, బంధువులతో కలిసి వెళ్ళగా, దొంగలు బోలేరో వాహనంలో పందులను ఎక్కించుకుంటుండగా పట్టుకున్నారు. దొంగలు ఖాళీ సీసాలతో దాడి చేసి పారిపోయారు.