అనంతపురం జిల్లా బెళగుప్ప మండలంలో పదో తరగతి పరీక్షల్లో 550 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు మండల విద్యాధికారి (ఎంఈవో) విమాన ప్రయాణం చేయించారు. ఈశ్వరి, మధుశ్రీ, అర్జున, ఇందు, లావణ్య అనే విద్యార్థులు ఈ విమాన ప్రయాణంలో భాగస్వాములు అయ్యారు. ఎంఈవో తన హామీని నిలబెట్టుకుని, విద్యార్థులతో కలిసి బెంగళూరుకు వెళ్లి, అక్కడ నుంచి హైదరాబాద్ కు విమానంలో వెళ్లారు.