రాష్ట్రపతి భవన్ లో ఘనంగా జరిగిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో తెలుగు రాష్ట్రాల నుండి ముగ్గురు వ్యక్తులు పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, కె.ఎల్. కృష్ణ, డాక్టర్ వదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి వంటి ప్రముఖులు ఈ అవార్డులను అందుకున్నారు. మందకృష్ణ మాదిగకు అవార్డు లభించిన సందర్భంగా ఆయన కుమార్తె భావోద్వేగానికి గురయ్యారు.