సరదాగా స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం సంకలమద్ది గ్రామానికి చెందిన మద్దెల ఆంజనేయులు గొంతులో మాంసం ముక్క ఇరుక్కొని మృతి చెందాడు. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు.