Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరఫున మాజీ మంత్రి మల్లా రెడ్డి వినూత్నంగా ప్రచారం చేశారు. రోడ్డు పక్కన టీ తయారు చేసి అందించడంతో పాటు, సెలూన్లో ట్రిమ్మర్‌తో హెయిర్ కట్ చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. ఆయన ప్రచార శైలి స్థానికుల్లో ఆసక్తి రేకెత్తించింది.