మలేషియాలోని ఓ ఆలయంలో పూజారి తనను అసభ్యంగా వేధించినట్లు భార సంతతికి చెందిన నటి లిశల్లిని కనరన్ ఆరోపించారు. గత నెల 21న సెపంగ్లోరి మరియమ్మన్ టెంపుల్కు తాను వెళ్లగా... గుడిలోనే.. దేవుడి ముందే.. తన ఛాతిని తాకే ప్రయత్నం చేశాడని ఆమె ఆరోపించారు. అంతేకాదు భారత్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలం అంటూ.. నీటిని తన ఒంటిపై పోశాడని ఆమె ఆరోపించారు.