మలేషియా ఎయిర్లైన్స్ MH370 విమానం 2014 మార్చి 8న అదృశ్యమై 11 ఏళ్లు గడిచాయి. కౌలాలంపూర్ నుండి బీజింగ్ వెళ్తున్న ఈ విమానం జాడ రాడార్ నుండి మాయమైంది. తాజాగా, మలేషియా ప్రభుత్వం దీనిపై తిరిగి దర్యాప్తు ప్రారంభించింది. ప్రయాణికుల కుటుంబ సభ్యులు తమవారి ఆచూకీ లేదా కనీసం విమాన శకలాలు లభించాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.