మహారాష్ట్రలోని నాందేడ్‌లో సంచలనం సృష్టించిన ఘటన ఇది. ప్రేమించిన అబ్బాయిని కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేయడంతో, ఆ యువతి చనిపోయిన ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. "అతడే నా భర్త" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పరువు హత్యలు ఆగాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.