తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలు ఏర్పడుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అంబటిపల్లి వాగు వరద ఉధృతితో రహదారి దెబ్బతింది. ఒక ప్రైవేట్ కంపెనీ బస్సు కాలువలోకి దూసుకెళ్ళడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. వర్షాల కారణంగా రవాణా, జీవనం అస్తవ్యస్తంగా మారింది.