మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసలపల్లిలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఊరికి వెళ్లిన మహిళ ఇంట్లో చోరీ జరిగిన వారం తర్వాత, దొంగ పాపభీతితో దొంగిలించిన 17 తులాల వెండి, 6 తులాల బంగారు గొలుసులను తిరిగి ఇంటి ముందే వదిలివెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.