కేంద్ర ప్రభుత్వం పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే కోటి 62 లక్షల మంది పీఎన్జీని వాడుతున్నారు. 2032 నాటికి ఈ సంఖ్యను 12.5 కోట్లకు పెంచడమే లక్ష్యం. ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) తో పోలిస్తే పీఎన్జీ పర్యావరణానికి తక్కువ హానికరం, సురక్షితమైనది, నిరంతర సరఫరాతో పాటు రన్నింగ్ ఖర్చు కూడా తక్కువ.