ఎస్కలేటర్లు ఎక్కేటప్పుడు షూ లేసులు తీవ్రమైన ప్రమాదానికి దారితీయవచ్చు. కొంతమంది షూ లేసులు సరిగ్గా కట్టుకోకపోవడం వల్ల గాయపడడం.. కొన్ని సందర్భాల్లో మరణించడం జరిగాయి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు, పెద్దలు ఎస్కలేటర్లను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. షూ లేసులు బాగా కట్టుకుని, ఫోన్లను ఉపయోగించకుండా ఉండటం ముఖ్యం.